కరోనా మహమ్మారి రెండో దశను ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వం రూ.20వేల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకు అదనంగా ఉచిత వ్యాక్సినేషన్ కోసం రూ.1000 కోట్లు, టీకా పంపిణీకి సంబంధించిన వసతుల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించింది. శుక్రవారం ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ వివరాలు వెల్లడించింది.
'కరోనా కట్టడికి రూ.20వేల కోట్ల ప్యాకేజీ' - కోవిడ్ ప్యాకేజీ కేరళ
కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం రూ.20వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకు అదనంగా వ్యాక్సినేషన్‌కు మరో రూ.1,500 కోట్లు సమకూర్చనుంది.
రూ.20వేల కోట్ల భారీ ప్యాకేజ్‌ను ప్రకటించిన ప్రభుత్వం!
'అందరికీ ఆహారం, ఆరోగ్యమే కొత్త బడ్జెట్ లక్ష్యం. మహమ్మారిని కట్టడి చేసి రాష్ట్రంలో మూడో దశ ఏర్పడకుండా చర్యలు చేపడతాం' అని కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి :ఆర్టీసీల మధ్య వివాదం- ఆ రాష్ట్రానిదే విజయం
Last Updated : Jun 4, 2021, 1:48 PM IST