నైరుతి బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారి కేరళ, తమిళనాడువైపుగా దుసుకొస్తోంది. డిసెంబర్ 4న తీరం దాటనుంది తుపాను. దీంతో డిసెంబర్ 3 నుంచి 5 తేదీల మధ్య కేరళలోని ఏడు దక్షిణ జిల్లాలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ క్రమంలో తుపానును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టింది కేరళ ప్రభుత్వం. ఇప్పటికే 2,849 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. మరో మూడు రోజుల పాటు చేపల వేటకు వెల్లటాన్ని నిషేధించారు.
" రాష్ట్రానికి 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. శుక్రవారానికి తుపాను తిరువనంతపురాన్ని తాకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీతో కూడా తుపాను గురించి మాట్లాడాం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇప్పటికే 175 కుటుంబాలకు చెందిన 690 మందిని 13 శిబిరాలకు తరలించాం. పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున శబరిమలకు వచ్చే భక్తులపై వాతావరణాన్ని అనుసరించి ఆంక్షలు ఉంటాయి. "
- పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి.
రెడ్ అలర్ట్..