కొవిడ్ మహమ్మారి కారణంగా అనుకోని పరిస్థితుల్లో బాల రైతుగా మారాడు కేరళకు చెందిన మ్యాథ్యూ బెన్నీ. 13 ఏళ్లకే పదమూడు ఆవులను చూసుకుంటూ.. పశువుల పెంపకంలో తనదైన ముద్రవేస్తున్నాడు.
ఇడుక్కి జిల్లా తోడుపుళ గ్రామానికి చెందిన మ్యాథ్యూ తండ్రి గతేడాది అనారోగ్య సమస్యలతో మరణించాడు. దీనితో పశువుల పెంపకంపైనే ఆధారపడిన మ్యాథ్యూ కుటుంబం కష్టాల్లో పడింది. ఈ ఘటనతో తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ బాధ్యతలను స్వీకరించాడా బాలుడు.