Man Dies Setting Him on Fire: తన స్నేహితురాలు మరొకర్ని వివాహం చేసుకుంటుందని ఆమెను హత్య చేయాలనుకున్నాడో వ్యక్తి. ఈ క్రమంలో విఫలమై తానూ నిప్పంటించుకుని చనిపోయాడు. ఈ దారుణ ఘటన కేరళ కోజికోడ్‌లో జరిగింది. నడపురం గ్రామంలో రత్నేష్(41) ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. తన స్నేహితురాల్ని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. ఆమె పెళ్లిని మరొకరితో కుదిర్చారు. ఏప్రిల్‌లో ఆమె పెళ్లి పీఠలెక్కాల్సి ఉంది. ఇది సహించని రత్నేష్.. స్నేహితురాల్ని హత్య చేయాలనుకున్నాడు. మంగళవారం వేకువజామున 2 గంటల సమయంలో బాధిత మహిళ ఇంటికి వెళ్లాడు. నిచ్చెన సహాయంతో ఆమె ఇంటి రెండో అంతస్తు ఎక్కి, బెడ్రూమ్కు నిప్పంటించాడు.
వేరొకర్ని పెళ్లాడుతుందని ఆమెకు నిప్పంటించి.. తానూ మంటల్లో కాలి.. - ఓ మహిళ ఇంటికి నిప్పంటించి తాను నిప్పంటించుకని వ్యక్తి మృతి
Man Dies Setting Him on Fire: స్నేహితురాల్ని వివాహం చేసుకోవాలనుకున్నాడు. పెద్దలు అంగీకరించలేదు. ఆమె పెళ్లి మరొకరితో కుదిరింది. సహించలేక ఆమెను హత్య చేయాలని పథకం పన్నాడు. కానీ విఫలమై.. తాను నిప్పంటించుకుని మరణించాడో వ్యక్తి. కేరళ, కోజికోడ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
కేరళలో నిప్పంటించుకుని వ్యక్తి మృతి
మంటలు గమనించిన ఇంటిపక్క వ్యక్తి అందర్నీ పిలిచాడు. ఆ ఇంటివైపు అందరు పరుగులు పెడుతూ వస్తుండగా.. నిందితుడు కిందికి దిగి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చూస్తుండగానే మంటల్లో కాలిపోయాడు. ఈ ఘటనలో బాధిత మహిళ, ఆమె సోదరుడు, వదిన గాయాలపాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఇద్దరు భార్యల ముద్దుల భర్తకు మహాకష్టం.. '50-50 ఫార్ములా'తో పోలీసుల తీర్పు!
Last Updated : Mar 29, 2022, 1:48 PM IST