లక్షద్వీప్ పాలనాధికారిగా ప్రఫుల్ ఖోడా పటేల్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రఫుల్ ప్రవేశ పెట్టిన పలు వివాదాస్పద సంస్కరణలను కూడా రద్దు చేయాలని పేర్కొంది. దీనికి ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. లక్షద్వీప్ ప్రజల జీవితాలు, జీవనోపాధులకు రక్షణ కల్పించే విధంగా కేంద్రం తక్షణం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పేర్కొంది.
లక్షద్వీప్ రగడ - కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం - lakshadweep
లక్షద్వీప్ పాలనాధికారిని తక్షణమే తొలగించాలంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టింది. ఇది ఎకగ్రీవంగా ఆమోదం పొందింది. ఆ ప్రాంత ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ సమస్యలో వెంటనే జోక్యం చేసుకోవాలని పేర్కొంది.
![లక్షద్వీప్ రగడ - కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం lakshadweep, lakshadweep administrator](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10:58:19:1622438899-11960772-assembly.jpg)
లక్షద్వీప్ రగడపై కేరళ తీర్మానం
దమణ్, దీవ్లకు పాలనాధికారిగా ఉన్న ప్రఫుల్‌కు లక్షద్వీప్ బాధ్యతలు అప్పగించింది కేంద్రం. ఈయన రాకతో ఇక్కడ సమస్యలు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రఫుల్ ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు లక్షద్వీప్ వాసుల్లో అసంతృప్తి రగిలించాయని సమాచారం.
ఇదీ చదవండి :ఆయన సరైనోడే.. కానీ పార్టీ..?