అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కేరళ రాజకీయం స్టార్ ప్రచారకులతో హోరెత్తిపోనుంది. జాతీయ స్థాయి నేతలు, సినీ తారలతో క్యాంపెయినింగ్ కళకళలాడనుంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రానున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడం సహా.. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యటించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, వామపక్షాల తరఫున సీతారాం ఏచూరి కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొననున్నారు.
రాహుల్, ఏచూరి తొలుత కేరళలో అడుగుపెట్టనున్నారు. మార్చి 23 ఎర్నాకుళం, కొట్టాయం, త్రిస్సూర్ జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొంటారు. అదే రోజు రాష్ట్రానికి రానున్న ఏచూరి.. మార్చి 28 వరకు వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) క్యాంపెయిన్‌ను ముందుండి నడిపించనున్నారు.
మార్చి 30న మోదీ
ప్రధాని మోదీ రెండు సార్లు రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. మార్చి 30, ఏప్రిల్ 1న ప్రచారాన్ని చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మార్చి 24, 25, ఏప్రిల్ 3 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తారు. వివిధ నియోజకవర్గాల్లో ఎన్డీఏ తరఫున బరిలో ఉన్న అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తారు. మార్చి 27, ఏప్రిల్ 1 తేదీల్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ప్రముఖ నటి, భాజపా నేత విజయశాంతి సైతం కేరళ ప్రచారాన్ని పరుగులు పెట్టించనున్నారు. మార్చి 21 నుంచి జరిగే ఎన్డీఏ ప్రచార సభల్లో ఆమె పాల్గొంటారు. వారం పాటు ఆమె ప్రచార కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, భాజపా ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, బిప్లవ్ కుమార్ దేవ్ సైతం కేరళ ఎన్నికల కదనరంగంలో కాలు కదపనున్నారు.
ప్రియాంక రాక?