కేరళలోని సంప్రదాయ నృత్య రూపం తెయ్యం(Theyyam Dance). తెయ్యం ఆకృతిని (Theyyam Art) బేకరీ వస్తువులతో రూపొందించి ఆకట్టుకుంటున్నారు సురేశ్ అనే కళాకారుడు. అతడిది కేరళనే. 'ద వించి' సురేశ్‌గా బాగా ప్రసిద్ధి.
ఈ కళాఖండాన్ని కన్నూర్‌లో (Theyyam Kannur) ఉన్న బేక్స్టోరీ అనే బేకరీలోని హాల్లో రూపొందించారు సురేశ్. అందుకోసం పలు రకాల రంగులు, సైజుల్లో ఉన్న 25వేల బిస్కెట్లు, ఇతర బేకరీ ఉత్పత్తులను వినియోగించారు.
"ఈ కళా రూపాన్ని బేక్ స్టోరీ అనే బేకరీలో రూపొందించాను. ఇది 24 అడుగుల పొడవు ఉంది. దీనిని పూర్తి చేయడానికి 15 గంటల సమయం పట్టింది. బేకరిలోని స్నేహితులు దానిని పూర్తి చేయడంలో సహకరించారు."