కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్‌కు రెండోసారి కరోనా సోకింది. గతేడాది సెప్టెంబర్ 23న తొలిసారి వైరస్ బారిన పడిన ఆయనకు.. ఇటీవల పరీక్షలు నిర్వహించగా మరోసారి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ.. త్రిస్సూర్ మెడికల్ కళాశాలలో చేరారు సునీల్.
సునీల్‌తో పాటు ఆయన కుమారుడు నిరంజన్ కృష్ణకు సైతం వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు వెల్లడించారు.
ఇదీ చదవండి:కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలేంటి?