దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గినా.. ఆయా రాష్ట్రాల్లో మాత్రం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కేరళలో మరో 4,969 మంది వైరస్ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 6లక్షల 88వేల 409కి చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,734 మంది వైరస్‌కు బలయ్యారు.
- మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 3,880 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18.84 లక్షలకు పెరిగింది. వైరస్‌తో పోరాడుతూ మరో 65 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 48వేల 499కి ఎగబాకింది.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో 1,539 మంది కరోనా బారినపడ్డారు. కేసుల సంఖ్య 5.70 లక్షలకు ఎగబాకింది. వైరస్ ధాటికి కొత్తగా 18 మంది బలవ్వగా.. చనిపోయిన వారి సంఖ్య 8,136కు చేరింది.
- దేశ రాజధాని దిల్లీలో మరో 1,363 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 6లక్షల 13వేలు దాటింది. దిల్లీలో ఇప్పటివరకు 10,182 మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో ఒక్కరోజులోనే 1,236 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 9లక్షల 5వేల 901కి చేరింది. వైరస్‌తో మరో 10 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 11,981కి పెరిగింది.
- తమిళ రాష్ట్రంలో కొత్తగా 1,174 వైరస్ కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 8లక్షల 3వేలకు పెరిగింది. ఇప్పటివరకు అక్కడ 11,942 కరోనా మరణాలు సంభవించాయి.
- రాజస్థాన్‌లో మరో 1,112 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో కేసుల సంఖ్య 2.95 లక్షలకు చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,589 మందిని కొవిడ్ బలితీసుకుంది.