కేరళ శ్రీకందపురంలో దారుణం జరిగింది. 9 నెలల పసికందును హతమార్చాడు ఓ దుర్మార్గపు తండ్రి. మెడ వెనుక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టి హత్య చేశాడు 31 ఏళ్ల సతీషన్. తర్వాత.. అతడు కూడా గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
చిన్నారిని కాపాడే ప్రయత్నంలో నిందితుడి భార్య అంజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంజు అరుపులతో ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు.. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. దాడికి పాల్పడే ముందు.. నిందితుడు తన తల్లిని ఒక గదిలో పెట్టి తాళం వేసినట్లు చెప్పారు.