తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజధానిలో రామరాజ్యమే నా కల: కేజ్రీవాల్​ - Delhi Chief Minister in Assembly

దేశ రాజధాని దిల్లీలో రామరాజ్య పాలన తీసుకురావడానికి 10 గోల్డెన్​ రూల్స్​ను అమలు చేస్తామని సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ అసెంబ్లీలో పేర్కొన్నారు. ఇందుకు విద్య కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అయితే 70 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్.. విద్యపై దృష్టి సారించలేదని, అందువల్లే ఇప్పటికీ కొందరు నిరక్షరాస్యులుగా ఉన్నారని విమర్శించారు.

Kejriwal to implement 10 'golden rules' to bring 'Ram Rajya' in Delhi
'రాజధానిలో రామరాజ్యమే నా కల'

By

Published : Mar 10, 2021, 6:12 PM IST

Updated : Mar 10, 2021, 7:04 PM IST

హనుమంతుడి భక్తుడిగా దేశ రాజధానిలో 'రామరాజ్యం' తీసుకురావడమే తన కల అని పేర్కొన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. అందుకోసం 10 గోల్డెన్​ రూల్స్​ అమలు చేస్తామని దిల్లీ అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో వ్యాఖ్యానించారు.

'రాజధానిలో రామరాజ్యమే నా కల'

"రామభక్తుడైన హనుమంతుడి భక్తుడిని నేను. రామభక్తుడిని కూడా. రాముడు అయోధ్యకు రాజు. ఆయన పాలన గొప్పగా సాగింది. ఆయన పాలనలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విచారం అనే మాటే లేదు. దీనినే రామరాజ్యం అని పిలుస్తారు. దిల్లీని రామరాజ్యంగా తయారు చేస్తాం."

- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ సీఎం

'విద్యపై కాంగ్రెస్ దృష్టిపెట్టలేదు​'

"70 ఏళ్లకుపైగా దేశాన్ని కాంగ్రెస్ పాలించింది. విద్య ప్రాముఖ్యాన్ని ​ఎప్పుడూ పట్టించుకోలేదు. ఫలితంగా సమాజంలో ఇప్పటికీ నిరక్షరాస్యులు అధికంగా ఉన్నారు. ప్రజలకు సరైన విద్యను అందిస్తే పాలనను ప్రశ్నిస్తారని వారికి(కాంగ్రెస్​) తెలుసు. ఏదేమైనా చివరికి అధికారాన్ని కోల్పోయింది" అని కాంగ్రెస్​పై విమర్శలతో విరుచుకుపడ్డారు కేజ్రీవాల్​.

ఇటీవల దిల్లీ బోర్డ్​ ఆఫ్​ స్కూల్స్​ ఎడుకేషన్​ రాజ్యాంగాన్ని దిల్లీ కేబినెట్​ ఆమోదించిందని కేజ్రీవాల్​ తెలిపారు. కంఠస్థ పద్ధతిపై తమ విద్యా వ్యవస్థ దృష్టిసారిందన్న ఆయన.. ఆ పద్ధతికి చరమగీతం పాడి అవగాహనపై దృష్టి కేంద్రీకరిస్తామని పేర్కొన్నారు.

రాముడి దర్శనానికి తీసుకెళ్తాం

అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి అయిన తర్వాత.. దిల్లీలోని వృద్ధులను రాముడి దర్శనానికి ఉచితంగా తీసుకెళ్తామన్నారు సీఎం కేజ్రీవాల్​.

ఇదీ చూడండి:వీగిపోయిన అవిశ్వాస తీర్మానం- ఖట్టర్​ సర్కార్​ సేఫ్​

Last Updated : Mar 10, 2021, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details