తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మే 17 నుంచి కేదార్‌నాథ్‌ దర్శనం - చార్​ధామ్​ యాత్ర

ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్​నాథ్​ ఆలయాన్ని మే 17న తెరవనున్నారు. బద్రీనాథ్ ఆలయాన్ని మే 18, గంగోత్రి యమునోత్రి ఆలయాలను అదే నెల 14న తెరవనున్నట్లు దేవస్థానం బోర్డు వెల్లడించింది. ​

Kedarnath
మే 17 నుంచి భక్తులకు కేదార్‌నాథ్‌ ఆలయ దర్శనం

By

Published : Mar 12, 2021, 6:19 AM IST

దేశంలోని ప్రఖ్యాత చార్‌ధామ్‌ (ఉత్తరాఖండ్‌) పుణ్యక్షేత్రాల దర్శనానికి ఏటా వచ్చే భక్తుల కోసం దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలను మే 17వ తేదీ ఉదయం 5 గంటలకు తెరవనున్నట్లు గురువారం వెల్లడించింది.

అలాగే బద్రీనాథ్‌ ఆలయాన్ని మే 18న.. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను అదే నెల 14న తెరవనున్నట్లు బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నాలుగు ఆలయాలను మంచు కారణంగా మూసివేసిన తర్వాత ఏటా ఏప్రిల్‌, మే నెలల్లో తిరిగి తెరుస్తుంటారు.

ఇదీ చూడండి :వైభవంగా 'ఈశా ఫౌండేషన్'​ మహాశివరాత్రి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details