కేదార్ ధామ్‌ను ముంచెత్తిన మంచు- పర్యటకులకు కనువిందు - rudraprayag kedarnath temple snowfall
కేదార్‌నాథ్‌ను మంచు కమ్మేసింది. అయినా కేదారేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. ఎటుచూసినా మంచు దృశ్యాలతో కేదార్నాథ్ క్షేత్రం కనువిందు చేస్తోంది.
తొలిమంచులో మహేశ్వరుడి దర్శనం
ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్‌లోని కేదార్నాథ్ క్షేత్రాన్ని మంచు ముంచెత్తింది. హిమపాతం ఆలయ పరిసర ప్రాంతాలను కప్పేసింది. ఈ సీజన్లో తొలిసారి మంచు కురుస్తున్నందువల్ల ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు.