తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. ఒంటెను దారుణంగా కొట్టి చంపిన గ్రామస్థులు - rajasthan camel killed

ఛత్తీస్​గఢ్​లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. స్కూల్​లో పనిచేసే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, యజమానిపై దాడి చేసి అతడి ప్రాణాలు పోవడానికి కారణమైన ఒంటెను.. గ్రామస్థులు కొట్టి చంపారు.

crime news
crime news

By

Published : Feb 8, 2023, 12:34 PM IST

ఛత్తీస్​గఢ్​లోని కవార్ధాలో ఘోరం జరిగింది. నాలుగేళ్ల బాలికపై ప్రైవేటు పాఠశాల సిబ్బందిలో ఒకరు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం బాలిక బంధువులకు తెలియగా.. వెంటనే స్కూల్​కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన తీవ్రత దృష్ట్యా వెంటనే పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

జిల్లా ఎస్పీ లాల్ ఉమేంద్ సింగ్ వెంటనే స్కూల్​కు చేరుకొని ఘటనపై విచారణ జరిపారు. స్కూల్​ గేట్లు మూసేసి సిబ్బందిని పిలిచి ప్రశ్నించారు. బాలిక ఇచ్చిన సమాచారంతో నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. "బాధితురాలి తల్లి మాకు ఫిర్యాదు చేశారు. బాలికపై అత్యాచార యత్నం జరిగిందని చెప్పారు. బాలికకు వైద్య పరీక్షలు జరిపించాం. అత్యాచారం జరిగినట్లు తేలింది" అని ఎస్పీ వెల్లడించారు. మరోవైపు, ఈ ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్థులు.. స్కూల్ మేనేజర్​పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు.

ఒంటెను కొట్టి హత్య
రాజస్థాన్​ బికానీర్​లో ఒంటెను కొట్టి చంపారు కొందరు వ్యక్తులు. పంచు పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. తన యజమాని సోహన్​రామ్​ను ఒంటె చంపేసిందని.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు దాన్ని కొట్టి హత్య చేశారని తెలుస్తోంది.

ఒంటెను కొట్టి చంపిన గ్రామస్థులు

వివరాల్లోకి వెళ్తే..
సోహన్​రామ్ కుమారుడు మోహన్​రామ్.. సోమవారం ఉదయం తన పొలంలో ఒంటెను కట్టేశాడు. కొద్దిసేపటికి మరో ఒంటె అక్కడికి వచ్చింది. దాన్ని చూసి సోహన్​రామ్ ఒంటె.. తాడును తెంపుకొని పారిపోయింది. ఆ ఒంటెను తీసుకొచ్చేందుకు సోహన్​రామ్ దానివెంట పడ్డాడు. ఈ సమయంలో ఒంటె సోహన్​రామ్​పై దాడి చేసింది. తలను గట్టిగా కొరికేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో సోహన్​రామ్ మెడకు గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత సోహన్​రామ్ బంధువులు, గ్రామస్థులు ఒంటెను వెంబడించి పట్టుకున్నారు. ఆగ్రహంతో దాన్ని తీవ్రంగా కొట్టి చంపారు. ఒంటె హింసాత్మకంగా మారిందని.. దాన్ని అలాగే వదిలేస్తే ఇతరులపైనా దాడి చేసే అవకాశం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. అందుకే దాన్ని చంపినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details