తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీచర్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు - kashmiri pandit teacher

Teacher shot dead: జమ్ముకశ్మీర్​లో ఉపాధ్యాయురాలిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె తీవ్రగాయాలపాలై చనిపోయింది. ఉగ్రవాదుల చర్య హేయమని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు.

hindu teacher shot dead in jammu kashimr
కశ్మీర్​లో హిందూ టీచర్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

By

Published : May 31, 2022, 11:17 AM IST

Updated : May 31, 2022, 1:28 PM IST

Jammu kashmir teacher: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. కుల్గామ్‌ జిల్లా గోపాల్‌పొరాలో 36 ఏళ్ల రజనీ బాల అనే ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కాల్పుల సమాచారం తెలుసుకున్న భద్రతా సిబ్బంది.. అక్కడకు చేరుకొని ముష్కరుల కోసం వేట ప్రారంభించారు.

Kashmiri pandit shot dead: జమ్మూలోని సాంబా జిల్లాకు చెందిన రజనీ బాల.. దక్షిణ కశ్మీర్‌లోని గోపాల్‌పొరాలో ఐదేళ్ల నుంచి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమెను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల చర్య హేయమని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వ తీరుపైనా ఆయన విమర్శలు గుప్పించారు.

ఘటన అనంతరం ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులను కచ్చితంగా పట్టుకుంటామన్నారు. ఇటీవలే జమ్ముకశ్మీర్‌లో టీవీ నటిని కాల్చిచంపారు ముష్కరులు. ఇప్పుడు మరో మహిళపై దాడి చేయడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

ఇదీ చదవండి:నిద్ర మత్తులో అంబులెన్స్​ డ్రైవర్.. ఒకే కుటుంబంలో ఏడుగురు బలి

Last Updated : May 31, 2022, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details