తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీ20 ప్రపంచకప్​లో 'కశ్మీరీ​ విల్లో బ్యాట్స్​'! - cricket bat

తండ్రి స్థాపించిన ఓ సాధారణ క్రికెట్​ బ్యాట్​ తయారీ పరిశ్రమను ఫజల్​ కబీర్​ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. కశ్మీరీ విల్లోతో తయారు చేసిన బ్యాట్​లను అంతర్జాతీయ జట్లకు విక్రయిస్తున్నారు.

willow
టీ20 ప్రపంచ కప్​లో 'కశ్మీరీ​ విల్లోలు'!

By

Published : Oct 20, 2021, 1:14 PM IST

Updated : Oct 20, 2021, 2:14 PM IST

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్న క్రీడల్లో క్రికెట్​ ఒకటి. అందులోనూ భారత్​లో ఈ గేమ్​కు ఉన్న క్రేజే వేరు. ఆటగాళ్లు బ్యాట్లు ఝుళిపిస్తూ గ్రౌండ్​లో సిక్స్​లు, ఫోర్లు బాదుతుంటే స్టేడియం అంతా ఈలలు, చప్పట్లతో దద్దరిల్లుతుంది. ఈ సందర్భంగా ఆటగాళ్లు వాడిన బ్యాట్​ గురించి కూడా చర్చ జరుగుతుంటుంది. అలా.. క్రికెట్​లో ప్రత్యేక స్థానం సంపాదించాయి విల్లో బ్యాట్​లు. ఈ రకం బ్యాట్లు ఇంగ్లాండ్​ తర్వాత ఎక్కువగా భారత్​లోనే ఉత్పత్తి అవుతాయి.

గ్రేట్​స్పోర్ట్స్​ రూపొంచిన కశ్మీర్​ విల్లో బ్యాట్లు
కశ్మీరీ విల్లో బ్యాట్​తో కబీర్​

టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కశ్మీరీ విల్లో బ్యాట్​లకు కూడా డిమాండ్​ పెరిగింది. ఈ అవకాశాన్నే అందిపుచ్చుకున్నారు జమ్ముకశ్మీర్​కు చెందిన ఫజల్​ కబీర్​. గ్రేట్​స్పోర్ట్స్​ సంస్థకు చెందిన బ్యాట్లను ఆటగాళ్లు ఈ ప్రపంచకప్​లో వినియోగించేలా కృషి చేశారు. తమ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు ఏడేళ్లు పట్టిందని తెలిపారు.

"గత ఏడేళ్లగా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఇతర దేశాల్లోనూ మా ఉత్పత్తులు అమ్ముడుపోవాలంటే మార్కెటింగ్​ అవసరం. ఇప్పుడు మేము స్పాన్సర్​ చేసిన దేశాల జట్లు ఈ కశ్మీరీ విల్లో బ్యాట్​తో ఆడడం పట్ల సంతోషంగా ఉంది. ఒకప్పుడు మా ఉత్పత్తులను తిరస్కరించిన వాళ్లే ఇప్పుడు మళ్లీ మమ్మల్ని సంప్రదిస్తున్నారు."

-ఫజల్​ కబీర్, గ్రేట్​స్పోర్ట్స్​ యజమాని

ప్రస్తుతం తమ కశ్మీరీ​ విల్లో బ్యాట్​లను ఒమన్​ జట్టు బ్యాట్స్​మెన్​ ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.

1974లో ఫజల్ తండ్రి ఈ బ్యాట్​ తయారీ పరిశ్రమను స్థాపించారు.

ఇదీ చూడండి :చైనా కుటిల నీతి.. తిప్పికొట్టేందుకు భారత్​ వ్యూహ రచన

Last Updated : Oct 20, 2021, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details