Kashmir tourists: కశ్మీర్ లోయకు పర్యటకుల తాకిడి పెరుగుతోంది. గత కొద్ది నెలలుగా పెద్ద సంఖ్యలో ప్రజలు కశ్మీర్‌ను సందర్శించుకుంటున్నారు. ఒక్క నవంబర్ నెలలోనే లక్షా 27వేల 605 మంది పర్యటకులు లోయ అందాలను ఆస్వాదించారు. కశ్మీర్‌ను ఒక నెలలో సందర్శించిన పర్యటకుల సంఖ్య... గత ఏడేళ్ల కాలంలో ఇదే అత్యధికం కావడం విశేషం.
Kashmir tourism news:
ప్రకృతి అందాలను అస్వాదించేందుకు కశ్మీర్ లోయకు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. కాలాలతో సంబంధం లేకుండా.. ఇక్కడికి పర్యటకులు వస్తారు. 2017 నవంబర్‌లో 1,12,300 మంది సందర్శకులు కశ్మీర్‌కు రాగా.. 2018లో 33,720, 2016లో 23,569 మంది, 2015లో 64,778 మంది లోయకు వచ్చారు. 2020లో అతితక్కువగా 6,327 మంది మాత్రమే.. కశ్మీర్‌ను సందర్శించారు.