Kashmir Tempo Accident: జమ్ముకశ్మీర్ రంబన్ జిల్లాలోని చూచైతర్ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్సు అదుపుతప్పి లోయలోపడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి.
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు రంబన్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
అంత్యక్రియలకు వెళ్లివస్తుండగా..
అదుపు తప్పి లోయలో పడ్డ మినీ బస్సు వీరంతా.. సోమవారం రాత్రి శ్రీనగర్‌లో ఉగ్రవాద కాల్పుల్లో మరణించిన ఏఎస్సై గులామ్ హసన్ అంత్యక్రియల్లో పాల్గొన్ని తిరిగి వస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. వాహనం అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామన్నారు. మృతులంతా ఏఎస్సై గులామ్ హసన్ బంధువులేనని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:కశ్మీర్‌పై పాక్ మరో కుట్ర- ఉగ్రమూకలకు 'లౌకిక' ముసుగు!