జమ్ముకశ్మీర్‌కు చెందిన 60 మంది యువకులు(kashmir youth) కనిపించకుండా పోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(taliban afghanistan) ఆక్రమించుకున్న నేపథ్యంలో.. లోయలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు కనిపించట్లేదని పలు సోషల్ మీడియాలలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని పేర్కొన్నారు. తాలిబన్లతో వీరు కలిశారా? అన్న ప్రశ్నకు బలం చేకూర్చేలా ప్రచారం జరిగిందని తెలిపారు. అయితే ఇవన్నీ.. పుకార్లేనని స్పష్టం చేశారు. స్థానికంగా ఎలాంటి మిస్సింగ్ కేసులు నమోదు కాలేదని వివరించారు.
"కశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాల నుంచి 60 మంది యువకులు కనిపించకుండా వెళ్లిపోయారని కొన్ని సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రచారమవుతోంది. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా జరిగిందని పోస్టుల్లో పేర్కొన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం."
-కశ్మీర్ జోన్ డీజీపీ