తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ల కలకలం.. పాక్​ పనేనా? - కశ్మీర్​లో డ్రోన్ల సంచారం

Kashmir News Drone: రాజస్థాన్​, జమ్ముకశ్మీర్​లోని సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ల సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది. అప్రమత్తమైన అధికారులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ డ్రోన్లు పాకిస్థాన్​ నుంచి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.

Kashmir News Drone
డ్రోన్ల కలకలం

By

Published : Mar 5, 2022, 11:43 AM IST

Kashmir News Drone: భారత సరిహద్దు ప్రాంతాల్లో శనివారం డ్రోన్లు కలకలం సృష్టించాయి. రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​ జిల్లా బిజనోర్​ గ్రామంలో డ్రోన్లను గుర్తించిన అధికారులు అప్రమత్తమై కాల్పులు జరిపారు. డ్రోన్​ను కూల్చేందుకు సుమారు 18 రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేపడుతున్నామని.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

కశ్మీర్​లోనూ..

జమ్ముకశ్మీర్​లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. జమ్మూ జిల్లాలోని అర్నియా ప్రాంతంలో డ్రోన్లు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇది పాకిస్థాన్​ చర్యగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ ద్వారా నిందితులు డ్రగ్స్​, బాంబులు వంటివి ఆ ప్రాంతానికి చేరవేశారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా గాలిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి :రోడ్డు పక్కన స్టాల్​లో 'టీ' తాగిన మోదీ.. కాశీలో 'ఛాయ్​ పే చర్చ'

ABOUT THE AUTHOR

...view details