Pakistani Terrorist: జమ్ముకశ్మీర్‌లో ఓ పాకిస్థానీ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టగా.. ఓ ముష్కరుడు కాల్పులు జరిపాడు. ఇది ఎన్‌కౌంటర్‌కు దారి తీసింది. పోలీసులు, సీఆర్పీఎఫ్, సైన్యం కలిసి చుట్టుముట్టాయి. లొంగిపోయే అవకాశం కల్పించినా అతడు ఒప్పుకోలేదు. ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు.
ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్, గ్రనేడ్లు సహా మందుగుండు సామగ్రిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
LET Terrorism in India: హతమైన వ్యక్తిని లష్కరే తోయిబాకు చెందిన పాకిస్థాన్ ఉగ్రవాది సైఫుల్లా అలియాస్ అబు ఖలీద్‌గా గుర్తించారు. కరాచీ నుంచి 2016లో భారత్‌లోకి చొరబడ్డాడని, కశ్మీర్లో ఎన్నో ఉగ్రకార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం సైఫుల్లా గ్రూప్ కమాండర్‌గా ఉన్నాడని చెప్పారు.