జమ్ముకశ్మీర్లో ముష్కరవేట కొనసాగుతోంది. పూంచ్, షోపియాన్, రాజౌరి జిల్లాల్లో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో షోపియాన్ జిల్లాలోని బాబపుర్లో జరిగిన ఎన్కౌంటర్లో(Kashmir Encounter) గుర్తుతెలియని వ్యక్తి మరణించగా.. జౌన్పుర్లో ఓ పౌరుడు చనిపోయాడని అధికారులు తెలిపారు.
Kashmir news: కశ్మీర్లో ఎన్కౌంటర్- పౌరుడు మృతి - కశ్మీర్లో ఎదురుకాల్పులు వార్తలు
జమ్ముకశ్మీర్లో (Kashmir Encounter) ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మరో ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ పౌరుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
కశ్మీర్లో ఎన్కౌంటర్
పూంచ్ జిల్లాలోని సూరన్కోట్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కాల్పులు తెగపడ్డారు. దీంతో సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఓ ఉగ్రవాది గాయపడ్డాడు. ఇతన్ని లష్కరే తోయిబా ముష్కరుడిగా గుర్తించిన అధికారులు.. అరెస్ట్ చేశారు. ముష్కర వేట కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:'మహిళలూ! చీకటి పడ్డాక పోలీస్‌స్టేషన్లకు వెళ్లొద్దు'