Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం, అనంతనాగ్ జిల్లాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య శనివారం కాల్పులు జరిగాయి. అనంతనాగ్ జిల్లా సర్హమా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టారు అధికారులు. ముష్కరుడు లష్కరే తోయిబాకు కమాండర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నిషార్ దార్గా గుర్తించారు. మరోవైపు కుల్గాం జిల్లాలో జరిగిన కాల్పుల్లో మరో ఉగ్రవాది మరణించాడని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలాల సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
అతను కూడా ఉగ్రవాదే:ముంబయి పేలుళ్ల సూత్రదారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడి హఫీజ్ తల్హా సయీద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది ప్రభుత్వం. లష్కరే తోయిబాకు నిధులు సమకూర్చడం, దాడులకు ప్రణాళికలు వేయడం వంటి పలు ఉగ్రవాద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు తెలిపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం(యూఏపీఏ) 1967 ప్రకారం సయీద్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది. ఇప్పటివరకు భారత్ ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో తల్పా సయీద్ 32వ వ్యక్తి.