kashmir Encounter: కశ్మీర్ శ్రీనగర్‌లో ముగ్గురు ముష్కరులను హతమార్చింది భారత సైన్యం. వీరిని లష్కరే తోయిబాకు చెందినవారిగా గుర్తించారు. ఖాన్మోహ్‌లో కొద్దిరోజుల క్రితం సర్పంచ్‌ను చంపింది వీరేనని పోలీసులు ధ్రువీకరించారు.
నౌగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న సమాచారంతో.. భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో మిలిటెంట్లు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు.. వారిని మట్టుబెట్టాయి.
సంఘటనా స్థలంలో మందుగుండు సామగ్రి, భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి.