Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. మొత్తం నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ కమాండర్ కమాల్ భాయ్‌ను హతమార్చినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. అతడు 2018 నుంచి ఉగ్ర కార్యకలాపాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి.. పుల్వామా, గందర్‌బాల్, హంద్వారాలో ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ చెప్పారు.
కశ్మీర్లో ఎన్కౌంటర్స్.. జైషే కమాండర్ సహా నలుగురు ముష్కరులు హతం - Jaish e mohammed
Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య వేర్వేరు చోట్ల ఎన్కౌంటర్లు జరిగాయి. శుక్రవారం రాత్రి నుంచి జరుగుతున్న ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో జైషే కమాండర్ కూడా ఉన్నాడు. మరో ఉగ్రవాది చిక్కినట్లు పేర్కొన్నారు.
Kashmir Encounter
పుల్వామాలో చేప్టటిన ఆపరేషన్‌లో కమాండర్‌తో పాటు మరో ముష్కరుడిని మట్టుబెట్టినట్లు తెలిపారు. గంధర్‌బాల్, హంద్వారాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో లష్కరే తొయిబాకు చెందిన మరో ఇద్దరిని హతమార్చినట్లు వివరించారు. మరో ఉగ్రవాదని ప్రాణాలతో పట్టుకున్నట్లు విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ముఖ్యమంత్రి పదవికి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా