తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో ఏకైక క్షయ రహిత జిల్లాగా బుద్గాం - భారత్​లో క్షయ రహిత జిల్లా

దేశంలో ఏకైక క్షయ రహిత జిల్లాగా నిలిచింది కశ్మీర్​లోని బుద్గాం. మొత్తం 65 జిల్లాలు దరఖాస్తు చేసుకోగా.. బుద్గాం స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ​

Kashmir: Budgam declared TB-free, becomes only district in country to achieve the milestone
దేశంలో ఏకైక క్షయ రహిత జిల్లాకు స్వర్ణం

By

Published : Mar 26, 2021, 12:08 PM IST

జమ్ముకశ్మీర్​లోని బద్గాం.. దేశంలోనే ఏకైక క్షయ రహిత జిల్లాగా నిలిచింది. దేశవ్యాప్తంగా మొత్తం 65 జిల్లాలు.. టీబీ రహిత ప్రాంతాల ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేయగా.. వాటిల్లో బద్గాం తన మెరుగైన పనితీరుతో​ అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. బుద్గాం జిల్లా గత ఐదేళ్లో కనబరిచిన పనితీరుకు స్వర్ణ పతకం అందించింది.

ఈ అవార్డు అందుకున్న నేపథ్యంలో హర్షం వ్యక్తం చేశారు ఆ జిల్లా టీబీ నివారణ అధికారిణి డాక్టర్​ అద్ఫార్​ యాసీన్​. "ఈ మైలు రాయిని చేరుకున్నందుకు గర్వంగా ఉంది. గత ఐదేళ్లుగా మా బృందం ఎంతో శ్రమ పడింది. చివరకు విజయం సాధించాం. అందుకు తగిన గుర్తింపు లభించింది" అని అధ్పార్​ అన్నారు. టీబీపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

60శాతం తగ్గిస్తే.. స్వర్ణం

2025 నాటికి భారత్​ను క్షయ రహిత దేశంగా చేయాలన్న లక్ష్యంతో ప్రచారం ముమ్మరం చేసింది కేంద్రం. దీనిలో భాగంగా క్షేత్ర స్థాయిలో క్షయ వ్యాధిపై అవగాహన ప్రచారాన్ని వేగవంతం చేయాలని అన్ని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏ జిల్లా అయిన ఐదేళ్లలో క్షయ వ్యాధిని 60 శాతం తగ్గిస్తే.. స్వర్ణ పతకాన్ని, 40 శాతం తగ్గిస్తే కాంస్యం, 20 శాతం అయితే రజతాన్ని అందిస్తున్నారు.

ఇదీ చూడండి:హోలీ వేళ మోదీ మాస్క్​లకు భలే గిరాకీ

ABOUT THE AUTHOR

...view details