తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Kumbh Mela: గంగా పుష్కరాలు.. అన్నార్తిని తీరుస్తున్న తెలుగువారు - news on KASHI PUSHKAR KUMBH

varanasi special story: గంగా పుష్కర కుంభమేళా నేపథ్యంలో కాశీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలు.. తెలుగు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వాసవీ సదన్, తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే సోషల్ వర్క్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో గంగా ఘాట్ వద్ద భక్తులకూ, అన్నార్థుల ఆకలిని తీరుస్తున్నారు.

varanasi special story
గంగా పుష్కరాలు

By

Published : Apr 23, 2023, 10:41 PM IST

గంగా పుష్కరాలో తెలుగు రాష్ట్రాల స్వచ్ఛంద సంస్థలు

ganga Pushkara Kumbh Mela : కాశీలో ఏప్రిల్ 22 నుంచి మే 3వ తేదీ వరకు గంగా పుష్కర కుంభమేళా జరగనుంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారత దేశంతో పాటుగా... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో దక్షిణ భారతానికి చెందిన లక్షలాది మంది భక్తులు వారణాసికి వస్తారనే అంచనాలు ఉన్నాయిు. అందుకు తగ్గట్లుగా అక్కడి ప్రభుత్వం ఏర్పాట్ల చేసింది. అయితే అక్కడి ప్రభుత్వంతో పాటుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు, స్వచ్ఛంద సంస్థలు స్థానిక భక్తులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు, వేసవి నుంచి ఉపశమనం కోసం మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు అందిస్తున్నారు.

తానా ఆధ్వర్యంలో: తెలుగు ప్రజలు వచ్చే గంగా ఘాట్ ఒడ్డున బనారస్ ప్రజలతో పాటు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తుల కోసం తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే సోషల్ వర్క్ ఆర్గనైజేషన్) ద్వారా ప్రతిరోజూ 1000 మందికి ఆహారాన్ని అందజేస్తున్నారు. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు దాదాపు 22 మందికి పైగా వాలంటీర్లను నియమించారు. వారి ద్వారా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ పిఎస్‌ఆర్ కోటేశ్వర్ వెల్లడించారు. గంగాఘాట్‌ వద్ద ప్రతిరోజూ అన్నం, సాంబార్, రసం, పెరుగు, స్వీట్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వాసవీ సదన్ ఆధ్వర్యంలో: శ్రీశైలానికి చెందిన వాసవీ సదన్ కాశీ పుష్కరాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మజ్జిగ, నీళ్ల బాటిళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజూ 1000 మంది భక్తులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. వివిధ ఘాట్‌ల వద్ద ఈ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్​లోని యోగి ప్రభుత్వం తమకు అన్ని సౌకర్యాలు చక్కగా కల్పించిందని వెల్లడించారు. ఆంధ్ర ప్రభుత్వంతో కలిసి కాశీలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సహాయం చేస్తున్నామని సంస్థతో అనుబంధం ఉన్నవారు చెబుతున్నారు. వాసవీ సదన్ తరపున దేవకీ వెంకటేశ్వర్లు, శిద్ధా నాగేశ్వరరావు, కార్యదర్శులు ఉప్పల, మల్లికాజునరావుతోపాటు బృందం సభ్యులు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ 12 రోజులపాటు సమారు లక్ష మంది భక్తులు వస్తారని... వారందరికి తనగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఎంపీ జేవీఎల్: గంగా పుష్కరాలను కేంద్రప్రభుత్వం తరఫున రాజ్యసభ ఎంపీ జేవీఎల్ నరసింహారావు పర్యవేక్షిస్తున్నారు. కాశీలో 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గంగా పుష్కరాల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. పూర్వీకులకు పిండప్రదానాలు, కర్మకాండలు నిర్వహించే ఈ కార్యక్రమంలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details