ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రం కాశీలో కార్తీక పౌర్ణిమ వేడుకలు (Kashi Dev diwali 2021) వైభవంగా జరిగాయి. తొలిసారి బాలికలు, మహిళలు ముఖ్య పూజారుల హోదాలో గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగానదికి మహా హారతి ఇచ్చారు.
దేవ్ దీపావళిగా (Kashi Dev diwali 2021) ఈ ప్రాంతవాసులు జరుపుకొనే ఈ పండగ సందర్భంగా దీపోత్సవం నిర్వహించారు. 12 లక్షల దీపాల కాంతులతో కాశీ నగరం వెలుగులు విరజిమ్మింది. వందల సంఖ్యలో భక్తులు కాశీ ఘాట్‌లో దివ్వెలను వెలిగించారు.