తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కార్తిక పౌర్ణమి ఎప్పుడు - 26నా? 27వ తేదీనా? - కార్తీక పూర్ణిమ 2023

Kartik Purnima 2023 Date : కార్తిక మాసంలో వచ్చే పౌర్ణమిని ఎంతో పవిత్రమైన రోజుగా హిందువులు పరిగణిస్తారు. ఆ రోజున నదీ స్నానాలు చేసి.. దానం చేస్తే.. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. మరి, ఈ ఏడాది కార్తిక పూర్ణిమ ఏరోజున వచ్చింది? దాని ప్రాముఖ్యత ఏంటి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Kartik Purnima 2023
Kartik Purnima 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 9:51 AM IST

Kartik Purnima 2023 Date and Time :పరమ శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తిక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి ఈ పవిత్రమైన కార్తిక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తకోటి కఠిన నిష్టతో చేపట్టే వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ మాసంలో వచ్చే ప్రతిరోజూ మంచిదే. అందులోనూ కార్తికమాసంలో వచ్చే కార్తిక పౌర్ణమి(Karthika Pournami)గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. ఈ కార్తిక పూర్ణిమను అత్యంత పవిత్రమైనదిగా భక్తులు పరిగణిస్తారు. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తిక పౌర్ణమి ఈ ఏడాది ఏ రోజున వచ్చింది? పూజా ముహూర్తం ఎప్పుడు? పంచాగం ఏం చెబుతోంది? అనే విషయాలను ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

When is Kartik Purnima 2023 : శివ-విష్ణువులిద్దరికీ ఎంతో ఇష్టమైన ఈ కార్తిక పౌర్ణమిని.. శరత్‌ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలోనే కార్తిక పౌర్ణమి పర్వదినం వస్తుంది. వేదాలను అపహరించి, సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది కూడా ఈ పూర్ణిమనాడే! ఇంతటి పవిత్రమైన కార్తిక పౌర్ణమి రోజున భక్తులు ఉదయాన్నే పవిత్ర నదిలో స్నానం చేసి.. దాన, ధర్మాలు చేస్తారు. ఈ విధంగా చేస్తే ఈ మాసం మొత్తం భగవంతున్ని పూజించినంత ఫలితం లభిస్తుందని విశ్వసిస్తారు.

కార్తిక పౌర్ణమి ఏ రోజు..?

ఈ ఏడాది అధిక మాసం కారణంగా.. పండగ తిథులన్నీ రెండు రోజూల్లో విస్తరించి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా కార్తిక పౌర్ణమి కూడా రెండు రోజుల్లో వచ్చింది. నవంబర్ 26, 27 తేదీల్లో ఈ పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. దీంతో.. అత్యంత పవిత్రమైన కార్తిక పౌర్ణమి పండుగను ఏ రోజున నిర్వహించుకోవాలా..? అని భక్తులు సందిగ్ధంలో పడిపోయారు. దీనికి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

IRCTC కార్తీక మాసం స్పెషల్ టూర్ - 7 జ్యోతిర్లింగాల దర్శనం - స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా!

దృక్ పంచాంగం ప్రకారం :ఈ పంచాంగం ప్రకారం.. పౌర్ణమి తిథి నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 3గంటల 53 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే.. నవంబర్ 27న సాయంత్రం 02:45 గంటలకు ముగుస్తుంది. అయితే.. కార్తిక పౌర్ణమి అంటే ఆ రోజున చేయాల్సిన అతిముఖ్యమైన పని దీపం వెలిగించడం. దీపం వెలిగించడం ద్వారా.. జీవితంలోకి కొత్త కాంతిని ఆహ్వానిస్తారు. ఈ పని రాత్రివేళవేళ మాత్రమే చేస్తారు. దీపం వెలిగిస్తున్నప్పుడు పౌర్ణమి ఘడియలతోపాటు కృత్తిక నక్షత్రం ఉండాలి. ఇలా చూసుకున్నప్పుడు 26వ తేదీన మాత్రమే ఈ ఘడియలు ఉన్నాయి. అందువల్ల ఆ రోజునే(ఆదివారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత :అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున భక్తులు శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఆయన అనుగ్రహం కోసం దేవాలయాలను సందర్శించి, దీపాలు వెలిగిస్తారు. ఇలా.. కార్తిక దీపాలను వెలిగించి పూజ చేయడం వల్ల.. వెయ్యి యుగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇదే సమయంలో.. అభిషేక ప్రియుడైన శివునికి పాలు, తేనెతో అభిషేకం చేస్తారు. దీనినే 'రుద్రాభిషేకం' అంటారు.

karthika pournami 2023 : కార్తిక పౌర్ణమి నాడు దీపారాధన ఎందుకు చేయాలంటే?

Karthika Masam : దీపతోరణాలు.. శివపురాణ పఠనాలు.. వనభోజనాలు.. మరెన్నో ప్రత్యేకతలు

ABOUT THE AUTHOR

...view details