తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని మోదీపై ప్రశంసలు- కార్తీ చిదంబరానికి కాంగ్రెస్ షాక్! - కార్తీ చిదంబరానికి నోటీసు

Karthi Chidambaram Show cause Notice : మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం చిక్కుల్లో పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించటంపై తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. రాహుల్‌గాంధీ కంటే ప్రధాని మోదీకే ప్రజాదరణ ఎక్కువంటూ ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీ పేర్కొనటంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి.

Karthi Chidambaram Show cause Notice
Karthi Chidambaram Show cause Notice

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 10:27 PM IST

Updated : Jan 9, 2024, 10:47 PM IST

Karthi Chidambaram Show cause Notice :ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కార్తీ చిదంబరంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కార్తీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ గురించి ప్రస్తావించారు. రాహుల్‌ కంటే ప్రధాని మోదీకి ఎక్కువ పాపులారిటీ ఉందని వ్యాఖ్యానించారు.

ఈవీలంలపైనా కీలక వ్యాఖ్యలు
Congress EVM News : ఈవీఎంలపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఇటీవల ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈవీఎంలపై విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కేఆర్‌ రామసామి పార్టీ తరఫున చిదంబరానికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

'ఆఖిల భారత కాంగ్రెస్ కమిటీకే ఆ అధికారాలు'
మరోవైపు కార్తీ చిదంబరంకు షోకాజ్ నోటీసులపై ఆయన సన్నిహిత వర్గాలు స్పందించాయి. పార్లమెంట్‌ సభ్యుడికి నోటీసు జారీ చేసే అధికారం అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీకే ఉందన్నాయి. తమిళనాడులో ఆయనను ప్రధాననేతగా ఎదగనివ్వకుండా చేసేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించాయి.

కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీలో కీలక నేతలు
Congress Election Manifesto Committee 2024 : ఇటీవలే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు కాంగ్రెస్‌ మేనిఫేస్టో కమిటీని ప్రకటించింది. 16మందితో కూడిన ఈ కమిటీకి ఛైర్మన్‌గా మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంను నియమించింది. కన్వీనర్‌గా ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి టి.ఎస్‌ సింగ్‌దేవ్‌ వ్యవహరిస్తారు. ఈ మేరకు ఈ జాబితాను విడుదల కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆనంద్‌ శర్మ, జైరామ్‌ రమేశ్‌, శశిథరూర్‌ ఉన్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Jan 9, 2024, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details