పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్‌లో (kartarpur sahib pakistan) ఉన్న సిక్కుల పవిత్ర క్షేత్రం సందర్శనకు వెళ్లేందుకు ఏర్పాటుచేసిన కర్తార్‌పుర్ సాహెబ్ కారిడార్‌ను (kartarpur sahib corridor) బుధవారం తిరిగి తెరవనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ నిర్ణయం గురునానక్ దేవ్, సిక్కులపై మోదీ ప్రభుత్వానికి ఉన్న అపారమైన గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని ట్వీట్ చేశారు. దేశ ప్రజలంతా నవంబర్ 19న గురునానక్ దేవ్ జయంతిని జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ కారిడార్ పాకిస్థాన్‌లోని దర్బార్ సాహిబ్ ఆలయం నుంచి పంజాబ్‌లోని డేరాబాబా నానక్ మందిరాన్ని కలుపుతుంది. మరో మూడు రోజుల్లో గురునానక్ దేవ్ జయంతి ఉందనగా.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 2020 నుంచి నిలిపేసిన ఈ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది.
కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన పంజాబ్ సీఎం..