తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణిసేన చీఫ్​ హత్య- రాష్ట్ర బంద్​కు పిలుపు- నిందితుల్లో ఒకడు సైనికుడు! - రాజస్థాన్​లో ఆందోళనలు

Karni Sena Protest In Rajasthan : రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య రాజస్థాన్​లో కలకలం రేపింది. సుఖ్‌దేవ్ సింగ్ హత్యను నిరసిస్తూ కర్ణిసేన రాజస్థాన్​లో బంద్​కు పిలుపునిచ్చింది. మరోవైపు, సుఖ్​దేవ్ సింగ్ హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులను గుర్తించారు.

Karni Sena Protest In Rajasthan
Karni Sena Protest In Rajasthan

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 3:32 PM IST

Karni Sena Protest In Rajasthan: రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యను నిరసిస్తూ కర్ణిసేన రాజస్థాన్‌లో బంద్‌కు పిలుపునిచ్చింది. సుఖ్‌దేవ్‌ సింగ్‌ను హత్య చేసిన వారిని పట్టుకోవాలని పలు జిల్లాలో సుఖ్‌దేవ్ సింగ్ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. ఝలావడ్‌లో వ్యాపారులు సుఖ్‌దేవ్ హత్యను నిరసిస్తూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బరన్ పట్టణంలో కర్ణిసేన సభ్యులు స్థానిక ప్రతాప్ చౌక్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. చురు పట్టణంలో సుఖ్‌దేవ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నిందితులను పట్టుకోవాలని నినాదించారు. ధోల్‌పుర్ జిల్లాలో కర్ణిసేన సభ్యులు టైర్లను కాల్చి తమ నిరసనను తెలిపారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

స్కూళ్లు బంద్​
జయపుర జిల్లాలోని చాక్సు పట్టణంలో సుఖ్‌దేవ్ హత్యకు నిరసనగా పాఠశాలలు, దుకాణాలను మూసివేశారు. రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణి సేన అధ్యక్షుడ్ని హత్య చేసిన నిందితులను పట్టుకోవాలని సుఖ్‌దేవ్ మద్దతుదారులు జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతి పత్రం అందించారు. నిందితులను పట్టుకునే వరకు నిరసనలు కొనసాగుతాయని కర్ణిసేన వ్యవస్థాపకుడు లోకేంద్ర సింగ్ కల్వీ కుమారుడు బవాణీ సింగ్ కల్వీ తెలిపారు. సుఖ్‌దేవ్ హత్యపై ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాజ్​పుత్​ కర్ణిసేన చీఫ్​ హత్యకు వ్యతిరేకంగా నిరసనలు

భద్రతనే గహ్లోత్ ప్రభుత్వమే తగ్గించింది!
సుఖ్‌దేవ్‌కు అశోక్ గహ్లోత్ ప్రభుత్వమే భద్రతను తగ్గించిందని బీజేపీ ఆరోపించింది. సుఖ్‌దేవ్ హత్య విషయంలో ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిగా వైఫల్యం చెందిందని బీజేపీ ఎంపీ దియా కుమారి ఆరోపించారు. సుఖ్‌దేవ్‌ సింగ్‌కు భద్రత కల్పించడంలో అశోక్‌ గహ్లోత్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. సుఖ్‌దేవ్‌ సింగ్‌ను హత్య చేసిన నిందితులు కోసం గాలిస్తున్నామని రాజస్థాన్ డీజీపీ తెలిపారు. హరియాణా పోలీసులు సహకారం కోరామని వెల్లడించారు.

నిందితులు గుర్తింపు
రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. హరియాణాకు చెందిన నితిన్ ఫౌజీ, రాజస్థాన్​కు చెందిన రోహిత్ రాఠోడ్​ సుఖ్​దేవ్ సింగ్​పై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. వారి ఫొటోలు పట్టుకుని ముమ్మరంగా గాలిస్తున్నారు. అలాగే నిందితులిద్దరి ఫొటోలను పొరుగురాష్ట్రాల పోలీసులకు సైతం పంపించారు. నిందితులకు విదేశీయులతో సంబంధాలున్నట్లు సమాచారం. నితిన్‌కు జయపురలోని జోత్వారాలో బట్టల షాపు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నితిన్ ఫౌజీ సైనికుడు. ఆయన స్వస్థలం హరియాణాలోని దౌంగడా. నాలుగేళ్ల క్రితం నితిన్ ఆర్మీలో చేరాడు. ఈ ఏడాది నవంబరులో సెలవుపై నితిన్ అల్వార్ నుంచి సెలవుపై వచ్చాడని స్థానికులు తెలిపారు.

గవర్నర్​ సమీక్ష
మరోవైపు, రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి మంగళవారం హత్యకు గురైన నేపథ్యంలో రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్ర రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. ముఖ్య అధికారులతో ఆయన శాంతి భద్రతలపై చర్చించారు.

ఏం జరిగిందంటే?
రాష్ట్రీయ రాజ్​పుత్ కర్ణిసేన చీఫ్ సుఖ్​దేవ్ సింగ్ గోగమేడి జయపుర​లోని శ్యామ్​నగర్​లో ఉన్న ఆయన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. నలుగురు దుండగులు మంగళవారం మధ్యాహ్నం సుఖ్​దేవ్​ నివాసానికి వెళ్లి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన భద్రతా సిబ్బంది, మరొకరు గాయపడ్డారు. అలాగే తీవ్ర గాయాలైనసుఖ్​దేవ్ సింగ్​ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

ABOUT THE AUTHOR

...view details