తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుమారులతో కలిసి భర్తను చంపిన భార్య.. అక్రమ సంబంధమే కారణం! - కర్ణాటకలో దారుణం

ఓ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కోసం ఆస్తులు అమ్మేస్తుండగా.. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు అతడిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని కారులోనే ఉంచి నిప్పంటించిన ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

karnataka crime news
కర్ణాటక శివమొగ్గ జిల్లా నేర వార్తలు

By

Published : Oct 2, 2021, 1:29 PM IST

Updated : Oct 2, 2021, 6:39 PM IST

వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని సొంత కుటుంబీకులే హత్య చేసిన ఘటన కర్ణాటక శివమొగ్గ జిల్లాలో(Karnataka Shivamogga News) జరిగింది. సెప్టెంబర్​26న ఈ హత్య జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మృతుడి భార్య, కుమారులు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

దగ్ధమైన కారు

అసలేమైంది?

శివమొగ్గ(Karnataka Shivamogga News) జిల్లా అచాపుర గ్రామానికి చెందిన వినోద్​(45)కు తమ సమీప గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై వినోద్​తో తన కటుంబ సభ్యులు పలు మార్లు వాగ్వాదానికి దిగారు. వినోద్ ఇటీవలే తమ భూమిని అమ్మాడు. అందులో పెద్దమొత్తం వాటాను సదరు మహిళకు ఇవ్వాలనుకున్నాడు. మరో ఆస్తిని కూడా అమ్మేందుకు అతడు సిద్ధమయ్యాడు. ఈ ప్రయత్నాన్ని మానుకోవావాలని వినోద్​కు కుటుంబ సభ్యులు అనేకసార్లు చెప్పిచూశారు. కానీ, వినోద్ వారి మాట వినలేదు. దాంతో వినోద్​ను అంతమొందించాలని వారు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు.

ఆత్మహత్య అని నమ్మించేలా..

నిందితులు తగలబెట్టిన కారు
మృతుడు వినోద్​

సెప్టెంబర్​ 26న వినోద్​ను ఓ ఇనుప తీగతో గొంతు నులిమి, అతని తలపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారని పోలీసులు చెప్పారు. అనంతరం.. వినోద్​ ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించేలా నిందితులు.. మృతదేహాన్ని కారులో హుణసేకొప్ప అటవీ ప్రాంతానికి తరలించి.. నిప్పంటించారని తెలిపారు. ఈ కేసులో నిందితులు వినోద్ భార్య బిను(42), పెద్ద కుమారుడు వివేక్​(21), చిన్న కుమారుడు విష్ణు(19), బిను సోదరి కుమారుడు అశోక్​(23), వినోద్ సోదరుడు సంజయ్​(36)ను పోలీసులు అరెస్టు చేశారు.

అటవీ ప్రాంతంలో కాలిపోయిన కారును రెండు రోజుల తర్వాత గుర్తించిన తీర్థహళ్లి పోలీసులు.. మొదట వినోద్​ ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా భావించారు. కానీ, కుటుంబ సభ్యులను విచారించగా.. వారి సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. దీంతో తమదైన శైలిలో వారిని విచారించగా.. తామే హత్య చేశామని నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితులను జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. పరారీలో నిందితుడు!

ఇదీ చూడండి:ఎరుపు రంగు చూసి ఆవు బీభత్సం- మహిళలపై దాడి!'

Last Updated : Oct 2, 2021, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details