సరైన పత్రాలు లేకుండా బెంగళూరు నగర రోడ్లపై తిరుగుతున్న లగ్జరీ కార్లను అక్కడి రోడ్డు రవాణా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు పన్ను ఎగవేసేందుకు నకిలీ గుర్తింపు పత్రాలను కార్ల యజమానులు వినియోగిస్తున్నారని అధికారులు గుర్తించారు.
అమితాబ్ కారు కూడా..
పోలీస్ కమిషనర్ నరేంద్ర హోల్కర్, ఇన్స్పెక్టర్ తిప్పేస్వామి నేతృత్వంలోని ఆర్టీఏ అధికారుల బృందం.. ఈ ఆపరేషన్ను నిర్వహించింది. నకిలీ గుర్తింపు పత్రాలతో రిజిస్టర్ అయిన 15 లగ్జరీ కార్లను అధికారులు గుర్తించారు. వారు స్వాధీనం చేసుకున్న కార్లలో.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పేరు మీద రిజిస్టర్ అయిన ఓ రోల్స్ రాయిస్ కారు కూడా ఉండటం గమనార్హం. మరో రెండు కార్లు.. శాసన మండలి సభ్యుడు ఫరూక్ పేరు మీదుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.