తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పద్మాసనంతో సముద్రంలో ఈత.. కర్ణాటకవాసి అరుదైన ఘనత

సముద్ర అలల ధాటికి ఈత కొట్డడమే కష్టం. కానీ కర్ణాటకకు చెందిన 65 ఏళ్ల గంగాధర్​ మాత్రం కాళ్లను ఇనుప గొలుసుతో కట్టేసి.. పద్మాసనం వేస్తూ ఈత కొట్టి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రఖ్యాత 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​'లో చోటు సంపాదించారు.

Karnataka's Gangadhar sets new record by swimming in Padmasana posture
పద్మాసనంతో సముద్రంలో ఈత - ఇండియా బుక్​లో చోటు

By

Published : Jan 25, 2021, 11:56 AM IST

పద్మాసనంతో సముద్రంలో ఈత - ఇండియా బుక్​లో చోటు

కర్ణాటక ఉడిపికి చెందిన 65ఏళ్ల గంగాధర్.. కాళ్లకు ఇనుప గొలుసు​ కట్టుకుని పద్మాసనం వేస్తూ అరేబియన్​ సముద్రంలో ఈత కొట్టారు. 1400 మీటర్లను కేవలం గంటా 13 నిమిషాల 7 సెకన్లు ఈది.. 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​'లో చోటు సంపాదించుకున్నారు.

ఛాతితోనే స్మిమ్మింగ్​

పద్మాసనం వేస్తూ 800 మీటర్లు మేర.. ఛాతితో(బ్రెస్ట్​ స్ట్రోక్​) ఈతకొట్టిన గంగాధర్​ను చూసి ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​ అధికారులు ఆశ్చర్యపోయారు. ఈత కొట్టటంలో గంగాధర్​ ఇదివరకే చాలా రికార్డుల్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్​ పోటీల్లో 2009 నుంచి 2019 వరకు మొత్తం 31 బంగారు, 16 వెండి, 8 రజత పతకాలను సాధించారు.

గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్​ రాష్ట్రా​ల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ బంగారు పతకాలు సాధించారు గంగాధర్​.

ఇదీ చదవండి :'అలా చేస్తేనే బంగాల్​లో భాజపా విస్తరణ'

ABOUT THE AUTHOR

...view details