నట్‌మెగ్ పుట్‌బాల్‌లో ఇది ఒక టెక్నిక్. ప్రత్యర్థికి బంతి చిక్కకుండా ఆవతలి వాళ్ల కాళ్ల మధ్య నుంచి బంతిని నెట్టడం. మెస్సి, నెయ్‌మార్, బేల్ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు నట్‌మెగ్ ఆడటంలో దిట్ట. ఈ నైపుణ్యంలో మంగళూరుకు చెందిన ముహమ్మద్ షలీల్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. కేవలం 30 సెకన్లలో 10 ఫుట్‌బాల్ నట్‌మెగ్ చేసి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నట్‌మెగ్‌గా రికార్డు సృష్టించాడు. దీని కోసం పది నెలలు తాను కష్టపడ్డానని షలీల్ అంటున్నాడు.
ఫుట్‌బాల్‌లో ప్రపంచ రికార్డ్ మనదే.. ఆన్‌లైన్‌లో ట్రిక్స్ నేర్చుకుని గిన్నిస్‌లో చోటు - Karnataka Man Who Made 10 Nutmegs in 30 Seconds
ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడ ఫుట్‌బాల్. కానీ భారత్‌లో క్రికెట్‌ను మతంగా భావిస్తారు. ఇప్పుడిప్పుడే సాకర్‌కు దేశంలో ఆదరణ పెరుగుతోంది. అలాంటి ఆటలో కర్ణాటక మంగళూరుకు చెందిన ముహమ్మద్ షలీల్ గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించాడు. షలీల్ సాధించిన ఘనతేంటో ఇప్పుడు చూద్దాం
ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న షలీల్.. చిన్నతనం నుంచి తనకి పుట్‌బాల్ అంటే ప్రాణమని చెబుతున్నాడు. ఫుట్‌బాల్‌లో ఏదైనా సాధించాలని భావించిన షలీల్ గూగుల్‌లో వెతికి, నట్‌మెగ్‌లో రికార్డు సాధించాలని నిర్ణయించుకున్నాడు. మూడు నెలల నిరంతర సాధన ద్వారా నట‌్‌మెగ్‌పై పట్టు సాధించాడు. సెప్టెంబర్‌లో గిన్నిస్ రికార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న షలీల్.. ఆ తర్వాత వీడియో తీసి సమర్పించాడు. దాన్ని పరిశీలించిన గిన్నిస్ సంస్థ. షలీల్‌కు అధికారిక ఇమెయిల్ పంపించింది. త్వరలోనే గిన్నిస్ రికార్డ్ మెడల్ తమకు వస్తుందని షలీల్ చెప్పాడు.
2017లో ఇంగ్లండ్‌కు చెందిన డెలే 30 సెకన్లలో 7 నట్‌మెగ్‌లు చేసి తొలి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. 2021లో USAకు చెందిన మహిళా సాకర్ క్రీడాకారిణి తాషా నికోల్ టెరానీ 30 సెకన్లలో 9 నట్‌మెగ్‌లను చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. ఇప్పుడు షలీల్ 30 సెకన్లలో 10 నట్‌మెగ్‌లు చేసి ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భవిష్యత్తులో 11 నట్‌మెగ్‌లను చేయాలనేది తన లక్ష్యమని షలీల్ అంటున్నాడు. భారత ఫుట్‌బాల్ జట్టులో చేరాలని అందుకోసం నిరంతరం కృషి చేస్తున్నానని వెల్లడించాడు.