తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువకుడి కిరాతకం.. ప్రేయసిపై కత్తితో దాడి.. పెళ్లికి కొద్దిరోజుల ముందే... - కర్ణాటక దొడ్డబళ్లాపుర కత్తి దాడి

Karnataka woman stabbed: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు.. ఇద్దరి కుటుంబాలు ఇందుకు అంగీకారం తెలిపాయి.. అంతా సాఫీగా జరుగుతున్న సమయంలోనే ప్రేమికుడు.. తన ప్రేయసిపై దారుణానికి పాల్పడ్డాడు. కత్తితో పొడిచి యువతిని తీవ్రంగా గాయపరిచాడు. అసలు ఎందుకిలా చేశాడంటే?

Jilted lover stabs woman in Karnataka
ప్రేయసిపై కత్తితో దాడి

By

Published : Feb 11, 2022, 5:05 PM IST

Karnataka woman stabbed: కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. తనను తిరస్కరించిందన్న కారణంతో యువతిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. కత్తితో పలుమార్లు శరీరంపై పొడిచి హత్యాయత్నం చేశాడు. దొడ్డబళ్లాపురలోని ఐబీ సర్కిల్​లో ఈ ఘటన జరిగింది.

woman stabbed by lover

నిందితుడిని గిరీశ్(31)గా గుర్తించారు. బాధితురాలు 26 ఏళ్ల ప్రభావతి అని పోలీసులు తెలిపారు. ఆమె ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

నిందితుడు గిరీశ్

ప్రభావతి ఓ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో గిరీశ్ అకౌంటెంట్​గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ గతంలో ప్రేమించుకున్నారు. వివాహం కూడా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇరువురి తల్లిదండ్రులు కూడా ఇందుకు అనుమతించారు. అయితే, మహిళ మరో వ్యక్తితో రిలేషన్​షిప్​లో ఉందని గిరీశ్​కు అనుమానం వచ్చింది.

దీంతో ప్రభావతిపై దాడికి పాల్పడ్డాడు. బలవంతంగా ఇంట్లోకి చొరబడి గిరీశ్.. కత్తితో దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. మహిళ మెడ, వెన్ను, భూజాలపై గాయాలయ్యాయని తెలిపారు. గిరీశ్​ను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:క్రికెట్​ బాల్​ కోసం భారీ ఫైట్.. రోడ్డుపై కర్రలు, రాళ్లతో కొట్టుకుంటూ...

ABOUT THE AUTHOR

...view details