Karnataka Viral bridegroom Sucide: ఇరవై ఐదేళ్ల యువతిని వివాహం చేసుకుని అప్పట్లో వైరల్ అయిన 45ఏళ్ల వ్యక్తి.. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక తుమకూరు జిల్లాలోని అక్కిమరిపాళ్య గ్రామంలో జరిగింది. శంకరప్పకు 45 ఏళ్లు వచ్చేవరకు వివాహం జరగలేదు. ఈ విషయం తెలుసుకున్న మేఘన(25).. అతడ్ని ప్రేమించింది. అయితే.. మేఘనకు కూడా అప్పటికే వివాహం అయింది. ఆమె భర్త రెండేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. దీంతో శంకరయ్య అంగీకరించి మేఘనను 2021 అక్టోబర్‌లో గుడిలో వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి వార్త అప్పట్లో వైరల్ అయింది.
45 వెడ్స్ 25.. ఐదు నెలల క్రితం వైరల్.. ఇప్పుడు విషాదం.. పాపం ఆ అమ్మాయి... - Karnataka bridegroom suicide
Karnataka Viral bridegroom Sucide: ఇరవై ఐదేళ్ల అమ్మాయిని పెళ్లిచేసుకుని అప్పట్లో సంచలనంగా మారిన 45 ఏళ్ల వ్యక్తి కుటుంబ సమస్యలతో అత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక తుమకూరు జిల్లాలోని అక్కిమరిపాళ్య గ్రామంలో జరిగింది.
వైరల్ అయిన కర్ణాటక పెళ్లికొడుకు ఆత్మహత్య
పెళ్లైన తర్వాత మేఘన.. తన అత్తగారితో నిరంతరం గొడవపడేది. శంకరయ్యకు చెందిన రూ.2.5కోట్ల భూమిని అమ్మేయాలని ఇటీవల ఇంట్లో ఒత్తిడి తెచ్చింది. ఇందుకు శంకరయ్య అమ్మ అంగీకరించలేదు. తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో శంకరయ్య విసిగిపోయాడు. పొలంలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి:ఐఏఎస్ టాపర్‌కు మళ్లీ పెళ్లి.. సీనియర్ అధికారితో...
TAGGED:
Karnataka bridegroom suicide