టోల్ ఛార్జీల బాదుడు భరించలేక ఓ ఊరి ప్రజలు సాహసమే చేశారు. జాతీయ రహదారికి సమాంతరంగా మరో రోడ్డు వేసేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
ఇదీ జరిగింది..
టోల్ ఛార్జీల బాదుడు భరించలేక ఓ ఊరి ప్రజలు సాహసమే చేశారు. జాతీయ రహదారికి సమాంతరంగా మరో రోడ్డు వేసేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
ఇదీ జరిగింది..
ఉడుపి జిల్లా హేజ్మాడి గ్రామానికి చెందిన వాహనాలకు టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని అక్కడి ప్రజలు సంబంధిత అధికారులను కోరారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రహదారి కాంట్రాక్టర్ అయిన నవయుగ ఉడుపి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్(ఎన్యూటీపీఎల్) సదరు వాహనాలకు ఉచిత ప్రవేశాన్ని నిరాకరించింది. వెంటనే సర్పంచ్ నేతృత్వంలో హేజ్మాడి గ్రామస్థులు ఓ తీర్మానం చేశారు. టోల్గేట్ ఉన్న ప్రాంతంలో జాతీయ రహదారికి సమాంతరంగా రోడ్డు వేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా పనులు ప్రారంభించారు. మార్చి 30 నాటికి రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఆ ఊరి వాహనాలన్నీ కొత్త రోడ్డు ద్వారా ప్రయాణాలు సాగించడం ప్రారంభించాయి.
దీనితో సంబంధిత కాంట్రాక్టర్లు దిగొచ్చారు. హేజ్మాడి, కోడీ గ్రామాలకు చెందిన వాహనాలకు టోల్ఛార్జీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆయా ఊళ్లకు చెందిన వాహనాల వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:అజేయుడు ఊమెన్ చాందీ.. 12వ సారి బరిలోకి