కర్ణాటక విజయనగర జిల్లాలో కలుషిత నీరు తాగిన ఘటనలో ముగ్గురు మరణించారు. మరో 200 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అసలేం జరిగింది?
విజయనగర జిల్లా మకరబ్బి గ్రామంలో సెప్టెంబర్ 23న.. కలుషిత నీరు తాగి అనారోగ్యానికి గురై, 50మందికి పైగా ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నీలప్ప అనే 60 ఏళ్ల వృద్ధుడు సెప్టెంబర్ 28న మరణించాడు.
లక్కమ్మ, బాసమ్మ అనే మరో ఇద్దరు వృద్ధులు.. బళ్లారిలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా, వాంతులతో వారు ఆస్పత్రిలో చేరారు. కానీ, చికిత్స పొందుతూ మరణించారు.