తెలంగాణ

telangana

ETV Bharat / bharat

4 గుంటల స్థలంలో 265 వరి రకాలు.. ఎలా సాధ్యం? - వరి పంట రకాలు

ఓ రైతు తన 4 గుంటల పొలంలో 265 వరి రకాలను పండిస్తున్నారు. ఆయన పొలంలో స్థానిక వరి రకాలే కాకుండా విదేశాలకు చెందిన వరి గింజలు కూడా ఉన్నాయి. అసలెవరా రైతు? ఎందుకు వాటిని పండిస్తున్నారు?

paddy varieties
పొలంలో 265 వరి రకాలు

By

Published : Sep 19, 2021, 9:24 AM IST

రైతు పొలంలో 265 రకాల వరి వంగడాలు

మన పెద్దల కాలంలో బియ్యంలో ఎన్నో రకాలు ఉండేవి. కానీ, కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయి. ప్రస్తుతం రైతులు కొన్ని రకాల వరి పంటను మాత్రమే పండిస్తున్నారు. మనం ఆ బియ్యాన్నే తింటున్నాం. అయితే.. ఈ పరిస్థితి భవిష్యత్తులో కొనసాగకూడదని భావించిన ఓ రైతు.. వరిపంటలో విభిన్నమైన రకాలను తన పొలంలో పండిస్తూ.. సంరక్షిస్తున్నారు.

పొలంలో దేవతేమనే

4 గుంటల స్థలంలో..

కేవలం నాలుగు గుంటల స్థలంలో 265 వరి పంట రకాలను పండిస్తున్నారు ఉత్తర కన్నడ జిల్లా సిర్సీ తాలుకాకు చెందిన దేవతేమనే. ప్రతి వరి మొక్క అది ఏ రకానికి చెందిందో తెలుసుకునేందుకు వీలుగా.. ప్రత్యేక నంబర్​ను కర్రకు అతికించి పెంచుతున్నారు. ఆ నంబర్ల ఆధారంగా తన వద్ద ఉన్న పుస్తకంలో ఆ మొక్కకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తున్నారు.

ఒక్కో వరి రకానికి నంబర్​ వేసి పెంచుతున్న దేవతేమనే

విదేశాలవి కూడా..

ప్రస్తుతం దేవతేమనే పొలంలో.. 200 వరి పంట రకాలు ఉన్నాయి. మరో 65 వరి వంగడాలపై ఆయన అధ్యయనం చేస్తున్నారు. దేవతేమనే వద్ద ఉన్న వరిజాతుల్లో స్థానికంగా పెరిగే వరి రకాలతో పాటు విదేశాలకు చెందినవి కూడా ఉన్నాయి. నేపాల్​, థాయ్​లాండ్​కు చెందిన వరి రకాలు కూడా ఆయన తన పొలంలో పెంచుతున్నారు. హొన్నకాటు, జేనుగూడు, గౌడర భట్టా, దొడ్డ భట్టా, జిగ్గా వార్తిగా, నీరా మూలుగా, కారీ కాంటకా, లింబే మోహరీ వంటి స్థానిక వరి రకాలను ఆయన రక్షిస్తున్నారు.

గతంలో అగ్రికల్చర్​ ఫెయిర్​లో "ది ఇన్నోవేటివ్​ ఫార్మర్"​ అవార్డు దేవతేమనే అందుకున్నారు.

ఇదీ చూడండి:నిమజ్జనంలో అపశృతి- కుంటలో పడి బాలికలు మృతి

ABOUT THE AUTHOR

...view details