Karnataka Road Accident: కర్ణాటక హవేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లను ఓ లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం- ఇద్దరు చిన్నారులు సహా నలుగురు దుర్మరణం - Karnataka Road Accident News
Karnataka Road Accident: కర్ణాటక.. హవేరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఇందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు.
జిల్లాలోని కడూరు జంక్షన్ వద్ద మొక్కజొన్న లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరణించారు. బాధితులు శంకర గౌడ నాగప్పనవార్(40), శాంత హట్టిగౌడ (30), రఘు హట్టిగౌడ (12), పునీత (12)గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి:11 ఏళ్ల బాలికపై ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు అత్యాచారం