దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కర్ణాటకలో అత్యధికంగా 58,395 రికవరీలు నమోదయ్యాయి. దిల్లీ, మహారాష్ట్రలోనూ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా - దేశంలో కరోనా
దేశంలో కరోనా వైరస్ క్రమంగా బలహీనపడుతోంది. కర్ణాటకలో భారీగా రికవరీలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా 28 వేలు, కర్ణాటకలో 30 వేల మందికి వైరస్ సోకింది.
కరోనా
వివిధ రాష్ట్రాల్లో కేసులు ఇలా..
- దిల్లీలో 4,484 కొత్త కేసులు బయటపడ్డాయి. 265 మంది కొవిడ్ బారినపడి మృతి చెందారు.
- మహారాష్ట్రలో కొత్తగా 28,438 కేసులు బయటపడ్డాయి. 679 మంది కొవిడ్‌కు బలయ్యారు.
- కర్ణాటకలో 30,309 కొత్త కేసులు, 525 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజే అత్యధికంగా 58,395 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- కేరళలో మళ్లీ కేసులు పెరిగాయి. మరో 31,337 కేసులు వెలుగులోకి వచ్చాయి. 97 మంది మరణించారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో 8,737 కొత్త కేసులు నమోదయ్యాయి. 255 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి:కరోనా రికవరీల్లో భారత్ సరికొత్త రికార్డ్
Last Updated : May 18, 2021, 9:30 PM IST