భారీ వర్షాలు కర్ణాటకను అతలాకుతలం చేశాయి(karnataka rains). ముఖ్యంగా బెంగళూరు నగరంపై తీవ్ర ప్రభావం చూపాయి. పరిస్థితిని తెలుసుకునేందుకు సీఎం బసవరాజ్ బొమ్మైక్షేత్రస్థాయిలో పర్యటించారు.కేంద్రీయ విహార్ అపార్ట్మెంట్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు సీఎం బసవరాజ్ బొమ్మై స్వయంగా వెళ్లారు. మోకాలి లోతు నీటిలోనే జీపుపై తిరుగుతూ పరిస్థితిని సమీక్షించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు(bangalore rains).
వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శిస్తున్న సీఎం బసవరాజ్ బొమ్మై "కర్ణాటక వ్యాప్తంగా వరదలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా నాకు ఫోన్ చేశారు. పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం, పంటనష్టం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు."
-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక సీఎం
ప్రధాని కార్యాలయం ట్వీట్..
కర్ణాటక సీఎంతో మోదీ ఫోన్లో మాట్లాడారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది(karnatka cm news). వరదల కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై ఆయన విచారం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పింది.
రూ.50వేల నుంచి రూ.5లక్షలు..
వరదల కారణంగా ధార్వాడ్ జిల్లాలో మిరప, పత్తి, శనగ పంటలు భారీగా దెబ్బతిన్నాయి(karnatak floods). దీంతో రైతులకు రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు పరిహారం అందిస్తామని కర్ణాటక మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ శంకర్ పాటిల్ మునెనకొప్ప వెల్లడించారు. నవంబర్ 30లోగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ సాయాన్ని జమ చేస్తామని పేర్కొన్నారు(karnataka flood news).
వరద విలయం..
వరదలో చిక్కుకున్న వాహనాలు కర్ణాటకలో నవంబర్లో 129మిల్లిమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ మనోజ్ రాజన్ తెలిపారు(karnataka news). ఇది సాధారణంతో పోల్చితే 271శాతం అధికమని పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వరదలు సంభవించి కర్ణాటక వ్యాప్తంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 658 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 8,495 ఇళ్లు పాక్షికంగా తెబ్బతిన్నాయి. 200 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. 3,79,501 హెక్టార్ల పంట రైతుల చేతికి అందకుండా పోయింది. 2,203 కిలోమీటర్ల మేర రోడ్లు, 165 వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. అంతేగాక 1225 పాఠశాలలు, 39 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వర్షాల కారణంగా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా బెంగళూరులో ఓ సరస్సు పొంగిపొర్లి వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అపార్ట్మెంట్లలోకి కూడా వరద నీరు ప్రవేశించింది. స్థానికులు పడవల ద్వారా ఇళ్లకు చేరుకున్నారు. విపత్తు నిర్వహణ సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.
అపార్ట్మెంట్లో భారీగా వరద నీరు, పడవలో స్థానికులు వరదలో శునకాన్ని తీసుకెళ్తున్న వ్యక్తి వరదలో చిక్కుకున్న ఆటోనూ లాక్కెళ్తన్న దృశ్యం ఇదీ చదవండి:Tamilnadu rain: మరో 4 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
Corona cases in India: 543 రోజుల కనిష్ఠానికి కరోనా కేసులు