తెలంగాణ

telangana

ETV Bharat / bharat

VIDEO VIRAL: సినీ ఫక్కీలో కిడ్నాపర్ల ఆటకట్టు - అరకలగూడు

సినీ ఫక్కీలో ఓ కిడ్నాప్​ కేసును ఛేదించారు కర్ణాటక పోలీసులు. కేరళలో కిడ్నాప్​ అయి రాష్ట్రానికి తరలిస్తున్న బాధితుడిని కిడ్నాపర్ల చెర నుంచి చాకచక్యంగా తప్పించారు.

Karnataka police
కర్ణాటక

By

Published : Jul 29, 2021, 8:15 PM IST

సినీ ఫక్కీలో ఓ కిడ్నాప్​ కేసును ఛేదించిన పోలీసులు

సినిమాల్లో కిడ్నాపర్లను పోలీసులు ఛేజ్​ చేసి పక్క ప్రణాళికతో పట్టుకునే సీన్లు భలే థ్రిల్లింగ్​గా ఉంటాయి. అలాంటివి వాస్తవంగా చూసే అవకాశం అరుదుగా లభిస్తుంది. కర్ణాటకలో నిజంగానే కిడ్నాపర్ల చెర నుంచి బాధితున్ని పోలీసులు చాకచక్యంగా విడిపించిన తీరు చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ జరిగింది..

ప్రాంతం.. కర్ణాటకలోని హసన్ జిల్లా.. సమయం.. బుధవారం ఉదయం..

కిడ్నాపర్లను ఛేదిస్తున్న పోలీసులు

కేరళలోని కాసరగోడ్​కు చెందిన అన్వర్​ అనే వ్యక్తిని ఆర్థికపరమైన వివాదం కారణంగా దుండగులు అపహరించారు. వారు కాసర్​గోడ్​ నుంచి కర్ణాటక సరిహద్దుకు వస్తున్నారనే సమాచారం హసన్​ పోలీసులకు అందింది.

దీంతో వెంటనే అప్రమత్తమైన సక్లేశ్​పుర్​ అరకలగూడు, గోరూరు పోలీసులు.. కిడ్నాపర్ల కోసం కాపుకాశారు. వారి కారు అరకలగూడు చేరుకోగానే.. రోడ్డుకు అడ్డంగా ఓ లారీ, జేసీబీ అడ్డుగా పెట్టి పట్టుకోవాలనుకున్నారు.

కారును వెంబడిస్తున్న పోలీసులు

పక్కా ప్రణాళికతో ఎదురుచూస్తున్న పోలీసులకు ఓ ట్విస్ట్ ఎదురైంది. వారు ఉన్న ప్రదేశానికి కిడ్నాపర్ల కారు చేరుకోగానే పోలీసులు ఒక్కసారిగా దాడిచేశారు. దీంతో కారును యూటర్న్​ చేసి జారుకున్నారు నేరస్థులు. ఈ క్రమంలో సాహసించి కారు డోరు తీసిన పోలీసులు.. బాధితున్ని సురక్షితంగా బయటకు రప్పించారు. అయితే కిడ్నాపర్లు మాత్రం తప్పించుకున్నారు.

ఇదీ చూడండి:సీఎం పిల్లల కిడ్నాప్​కు కుట్ర.. రాజకీయాల్లో సంచలనం!

ABOUT THE AUTHOR

...view details