తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2021, 4:53 PM IST

ETV Bharat / bharat

దొంగలతో చేతులు కలిపిన పోలీస్​- 53 బైక్​లు చోరీ

Karnataka police bike theft: దొంగలతో చేతులు కలిపి 53 బైక్​లను దొంగిలించాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. ఇద్దరు మైనర్లతో కలిసి ఓ ముఠాగా ఈ చోరీలు చేశాడు. పైఅధికారులు విషయం తెలుసుకుని అతడ్ని అరెస్టు చేశారు. అపహరించిన బైక్​లను సీజ్ చేశారు.

op who groomed minors as bike lifters
దొంగల ముఠాతో చేతులు కలిపిన పోలీస్​- 53 బైక్​లు చోరీ

Karnataka police bike theft: దొంగలను పట్టుకుని జైల్లో వేయాల్సిన పోలీసే వారితో చేతులు కలిపి దర్జాగా చోరీలకు పాల్పడ్డాడు. ఇద్దరు మైనర్లతో కలిపి ఓ ముఠాను నడిపిస్తున్నాడు. ద్విచక్ర వాహనాలనే లక్ష్యంగా చేసకుని వాటిని ఎత్తుకెళ్తున్నాడు. కర్ణాటక బెంగళూరు విద్యానారయణపుర పోలీస్​ స్టేషన్​కు చెందిన ఈ కానిస్టేబుల్​ పేరు హొన్నప్ప దురదప్ప మలగి. ఇతడి దొంగతనాల గురించి తెలుసుకున్న పోలీసులు బైక్​ చోరీల రాకెట్​ గుట్టును రట్టు చేశారు. అతని వద్ద నుంచి 53 బైక్​లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.77 లక్షలు ఉంటుందని అంచనా.

దొంగల ముఠాతో చేతులు కలిపిన పోలీస్​- 53 బైక్​లు చోరీ

ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ, మలగితో చేతులు కలిపిన రమేశను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఉన్న ఇద్దరు మైనర్లను విచారిస్తున్నారు.

డీసీపీ సంజీవ్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. మలగి ఈ ముఠాతో కలిసి బెంగళూరులో బైక్​లను చోరీలు చేస్తున్నాడు. వాటిని ఉత్తర కర్ణాటకలోని దవనగెరె, రాణిబెన్నూర్​, బ్యదాగి ప్రాంతాలకు తీసుకెళ్లి అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు.

దొంగల ముఠాతో చేతులు కలిపిన పోలీస్​- 53 బైక్​లు చోరీ

సెకండ్ హ్యాండ్​ బైక్​లు విక్రయించే పోర్టల్​లో వేరే బైక్​ల రిజిస్ట్రేషన్​ వివరాలు తెలుసుకుని.. దొంగ రిజిస్టేషన్​ నంబర్లు సృష్టించేవాడు. అనంతరం ఆ బైక్​లను ఇతరులకు అమ్మేవాడు. కొన్నవారు రిజిస్ట్రేషన్​ పత్రాలు అడిగితే బ్యాంకు లోన్ పూర్తయ్యే వారకు అవి ఇవ్వలేనని నమ్మబలికాడు.

ఒక్కోసారి దొంగతనాలు చేస్తూ దొరికి పోలీస్ స్టేషన్​కు వెళ్లిన ఇద్దరు యువకులను తన బంధువులే అని మలగి విడిపించేవాడు.

ఈ ముఠా బెంగళూరులోని నంది లేఅవుట్, హెచ్​ఎంటీ లే అవుట్​, జలగాలి లే అవుట్, హెబ్బల్​, జ్ఞానభారతి, పీన్య, రాజగోపాల్​నగర్​ ఇతర ప్రాంతాల్లో బైక్​లను చోరీ చేసింది.

స్వాధీనం చేసుకున్న 53 బైక్​లలో మూడింటిని తిరిగి ఓనర్లకు అప్పజెప్పారు పోలీసులు. ప్రజలు తమ వాహనాలు జాగ్రత్తగా చూసుకోవాలని, సెకండ్ హ్యాండ్ బైక్​లు​ కొనే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:'కరోనా 2.0.. గంగా నదిలో 300కుపైగా మృతదేహాలు'

ABOUT THE AUTHOR

...view details