తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిలుక మిస్సింగ్.. ఆచూకీ చెప్పిన వారికి రూ.85వేలు - karnataka news

తప్పిపోయిన చిలుక ఆచూకీ చెప్పిన వ్యక్తికి భారీగా నజరానా అందజేసి.. దానిపై వారికి ఉన్న ప్రేమను చాటుకున్నారు ఓ కుటుంబ సభ్యులు. కర్ణాటకలోని తుముకూరులో జరిగింది ఈ ఘటన.

Karnataka: Missing parrot Rustuma found, owner gave a reward of 85 thousand
కనిపించకుండా పోయిన చిలుక.. ఆచూకీ చెప్పిన వారికి రూ.85వేలు అందజేత

By

Published : Jul 23, 2022, 4:52 PM IST

కనిపించకుండా పోయిన రామచిలుక కోసం ఓ కుటుంబం నిరీక్షణ ఫలించింది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రామచిలుక దొరకడం వల్ల ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. అంతేకాదు రామ చిలుక ఆచూకీ చెప్పిన వ్యక్తికి ముందు ఇస్తామని చెప్పిన సొమ్ము కంటే.. ఎక్కువగానే ఇచ్చి.. పక్షిపై వారి ప్రేమను చాటుకున్నారు.

చిలుక కోసం వేసిన పోస్టర్​

అసలేం జరిగిందంటే?

క‌ర్ణాట‌క‌, తుముకూరు నగరంలోని జయనగర్ ప్రాంతానికి చెందిన అర్జున్ అనే వ్యక్తి ఆఫ్రికన్ గ్రే రకానికి చెందిన చిలుకను పెంచుకుంటున్నాడు. ఈ నెల 16న అది ఎగిరిపోయింది. ఆ చిలుకను ఆ కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అది కనిపించకుండా పోయిన నేపథ్యంలో.. ఆచూకీ తెలిపిన వారికి నజరానా ప్రకటించారు. అప్ప‌జెప్పిన వారికి రూ.50 వేల‌ నగదు ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు అర్జున్​. చుట్టు పక్కల అంతా పోస్టర్లు వేయించాడు. సోషల్​ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశాడు.

తిరిగి వచ్చిన చిలుక

కొన్ని రోజులకు తుమకూరు బందెపాళ్య గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్య‌క్తికి ఆ చిలుక దొరికింది. వెంటనే ఆ చిలుక య‌జ‌మాని అర్జున్‌కు కాల్​ చేసి విషయాన్ని చెప్పాడు శ్రీనివాస్​. అయితే ఆ సమయంలో చిలుక చాలా బలహీనంగా ఉంది. ఈ క్రమంలో శ్రీనివాస్.. ఆ చిలుకకు సపర్యలు చేశాడు. అందుకే ముందు ఇస్తామని చెప్పిన దానికంటే.. రూ.35 వేలు ఎక్కువ‌గా న‌గ‌దు బ‌హుమ‌తిని శ్రీనివాస్​కు అందించాడు అర్జున్.

కనిపించకుండా పోయిన చిలుక

ఇదీ చదవండి:ఆ టీవీ డిబేట్​లపై సీజేఐ ఆందోళన.. 'ప్రజాస్వామ్యం రెండడుగులు వెనక్కి'

ABOUT THE AUTHOR

...view details