Minister not wearing mask: ప్రపంచమంతా కరోనాతో సావాసం చేస్తున్న ఈ తరుణంలో.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వైద్యులు, శాస్త్రవేత్తలు, మంత్రులు, దేశాధినేతలు పదేపదే చెబుతున్నారు. మాస్కు ధరిస్తే కరోనా దరిచేరే అవకాశాలు తక్కువగానే ఉంటాయని చెప్తున్నారు. అయితే, ఇలాంటి సమయంలో కర్ణాటకకు చెందిన ఓ మంత్రి మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగారు. అంతేకాకుండా, తాను చేసిన పనిని సమర్థించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును వాడుకున్నారు. మాస్కు తప్పనిసరేం కాదంటూ వ్యాఖ్యానించారు.
Umesh Katti Mask statement
కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఉమేశ్ కత్తి.. అటవీ శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. మాస్కు లేకుండానే అక్కడికి వెళ్లారు. దీనిపై విలేకరులు ఆయన్ను ప్రశ్నించగా.. మోదీ పేరు చెప్పి తప్పించుకున్నారు. 'ఏ ఒక్కరిపైనా ఆంక్షలు ఉండవని మోదీ చెప్పారు. మాస్కు ధరించడం వ్యక్తిగత బాధ్యత. ఇది వ్యక్తుల విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. నాకు మాస్కు పెట్టుకోవాలని అనిపించలేదు అందుకే ధరించలేద'ని అన్నారు.