తెలంగాణ

telangana

ఊరేగింపులో ఆ పాటలు పెట్టినందుకు వధూవరులపై దాడి!

By

Published : May 27, 2022, 6:25 PM IST

MES Activists hits Bride and Groom: పెళ్లి ఊరేగింపులో కన్నడ పాటలు పెట్టినందుకు వధూవరులపై దాడి చేశారు మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలు. ఈ ఘటన కర్ణాటక బెళగావిలోని ధామణె గ్రామంలో జరిగింది.

MES activists hits bride and groom:
MES activists hits bride and groom:

ఊరేగింపులో పాటలు పెట్టినందుకు వధూవరులపై దాడి!

MES activists hits bride and groom: పెళ్లి ఊరేగింపులో కన్నడ పాటలు పెట్టినందుకు వధూవరులపై దాడి చేశారు మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలు. ఈ ఘటన కర్ణాటక బెళగావిలో గురువారం రాత్రి జరిగింది. ధామణెకు చెందిన సాయిబన్నవర్​కు రేష్మతో వివాహం జరిగింది. రాత్రి గ్రామంలో ఊరేగింపు చేస్తూ కన్నడ పాటలు పెట్టుకున్నారు. కన్నడ జెండాలు పట్టుకుని యువకులు డ్యాన్స్​ చేస్తున్నారు.
ఈ సమయంలో అక్కడికి చేరుకున్న మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలు వారిపై దాడి చేశారు. వధూవరులను కూడా కొట్టారు. ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. క్షతగాత్రులను బెళగావిలోని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్పందించిన పోలీసులు.. నిందితులు అజయ్ ఎల్లూర్కర్​, ఆకాశ్​ సహా 10 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details