తండ్రిగా వారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన వ్యక్తే.. వారిపాలిట కాల యముడిగా మారాడు. భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని.. కోపంతో కన్న కుమార్తెలిద్దర్ని కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగిలో జరిగింది. నిందితుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే: నిందితుడు లక్ష్మీకాంత్(34) ఆటో డ్రైవర్. అతడు కలబురగిలోని బాంబో బజార్ నివాసి. ఆయన భార్య పేరు అంజలి. కొన్నాళ్ల క్రితం ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. నాలుగు నెలల క్రితం అంజలి వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. అప్పటి నుంచి లక్ష్మీకాంత్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. అనంతరం మద్యానికి బానిసయ్యాడు. అంజలి వేరే వ్యక్తితో పారిపోయినప్పటి నుంచి ఆమె పిల్లలు అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటున్నారు.